నేరస్థుడు ఎంతటి వారైనా శిక్ష తప్పదు

0 15,266
  • కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : నేరస్థుడు ఎంతటి వారైనా.. ఎక్కడికి వెళ్లినా చట్టం వలయం నుంచి తప్పించుకోలేరని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. మహిళపై హత్యాయత్నం కేసులో కోర్టు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధించినట్లు తెలిపారు. మాచారెడ్డి మండలం నెమ్మిలి గుట్టా తండాకు చెందిన నవీన్ తన వదిన జెరుపుల సంకి వేరే వాళ్లతో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో 2017 ఫిబ్రవరి 24న మాంసం కోసే కత్తితో ఆమెను పొడిచి హత్నాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ మేరకు మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితున్ని కోర్టులో హాజరు పరిచారని తెలిపారు. ఈ కేసులో నిందితునికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.100జరిమానా విధించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.