27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఆర్ గవాయి పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు భారత దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి మీద దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.  ఈ నిరసనలో వీహెచ్పీఎస్  జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ సీజేఐ బీఆర్ గవాయి మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడిగా చూడాలని అన్నారు. ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృత్తం కాకుండా  చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని గుర్తు చేశారు. గవాయి మీద దాడి చేసిన అగంతకుండిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ ప్రజాస్వామిక దేశంలో భౌతిక దాడులు హేయమైన చర్య అని అన్నారు. బీఆర్ గవాయి దళితుడు కాబట్టే ఈ దాడి జరిగిందని, సీజేఐ దళితుడు కాకుండా అగ్రకులాల వారు అయితే ఈ దాడి జరిగేదా అని ప్రశ్నించారు. దళితుల ఆత్మగౌరవం కోసం ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ  జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి, ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు మైలారం బాలు, ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తెడ్డు గంగారాం, ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్, నాంపల్లి, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మారుతి, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున, స్వప్న, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లాసింగారి భూమయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్, ఆకారం రమేష్, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శులు నాగం ప్రదీప్, చెవూరి శ్యాం, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మహేష్, రాము, ప్రశాంత్, ఎంఆర్పీఎస్ టౌన్ నాయకులు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Those who attacked BR Gavai should be punished immediately

More articles

Latest article