- ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో మక్కల సీజన్ ప్రారంభమై సుమారు 20 రోజులు అయినప్పటికిని మక్కల కొనుగోలు కేంద్రాలను ఇది వరకు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య అన్నారు. నిజామాబాద్ కేంద్రంలోని మార్క్ ఫెడ్ జిల్లా డిఎంకు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం మక్కలకు కనీసం మద్దతు ధర 2400 ప్రకటించినప్పటికిని రైతుల నుండి వ్యాపారస్తులు తక్కువ ధరలకు కొనడం వల్ల ఆరుగాలం కష్టపడిన రైతన్నలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి మన జిల్లాకు 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 100 కోట్లు కేటాయిస్తే నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, ఏఐకేఎంఐ జిల్లా ఉపాధ్యక్షులు బోరిగాం సాయిలు, జిల్లా నాయకులు నందిపేట దేవన్న, రాపాని గంగాధర్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
