29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

హాట్ కామెంట్ లకు ఆ ఎమ్మెల్యేలు బ్రాండ్ అంబాసిడర్ లా

Must read

📰 Generate e-Paper Clip

  •  నిత్యం ఏదో ఒక హాట్ కామెంట్ చేయటం వారికి సర్వసాదారణం
  • తమ నియోజకవర్గ సమస్యల పైనే కాదు
  • రాష్ట్ర రాజకీయాలపై కామెంట్లు
  • అర్థంకాక మట్లాడుతున్నారా
  • సొంత పార్టీలోనే ప్రత్యేక గుర్తింపు పొందాలనుకుంటున్నారా?

నిజామాబాద్, బతుకమ్మ: హాట్ కామెంట్ లకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యేలు బ్రాండ్ అంబాసిడర్ గా మరారు. నిత్యం ఏదో ఒక హాట్ కామెంట్ చేయటం వారికి సర్వసాదారనంగా మారింది.తమ నియోజకవర్గ సమస్యల పైనే కాదు,రాష్ట్ర రాజకీయాలపై ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తునే ఉంటున్నారు.ఏం మాట్లాడాలో అర్థంకాక మట్లాడుతున్నారా?లేక సొంత పార్టీలోనే ప్రత్యేక గుర్తింపు పొందాలనుకుంటూన్నారా అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బిజేపి తరపున ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఆర్మూర్ నుంచి రాకేష్ రెడ్డీ, కామారెడ్డీ నియోజకవర్గంలో వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్ స్థానంలో ధన్ పాల్ సూర్యనారాయణలు గెలిచారు. అర్బన్ నుండి గెలిచిన దన్ పాల్ సూర్యనారాయణ తన పని తాను చేసుకుంటూంటే, మిగితా ఇద్దరు బిజేపి ఎమ్మెల్యేలు మాత్రం నిత్యం వివాదాల్లో తలదూర్చుతున్నారు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండడంతో నిధుల మీద ఆశలేదని బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియానే కాదు ఏ వేదిక మీదైనా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరు అభివ్రుద్ది అంశాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత చరిష్మా కోసమే ఇలా కామెంట్స్ చేస్తూన్నారని ఆయా నియోజక వర్గా ప్రజలు చర్చించుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. నిత్యం ఏదో ఒక అంశంపై ఆయన చేసే వ్యాఖ్యలు తీవ్ర చర్చనియాంశంగా మారుతున్నాయి. తన నియోజకవర్గ విషయాలతో పాటు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడిన తీరు అందరిని విస్తుపోయేలా చేసింది. జిల్లా కలెక్టర్ తో పాటు ఎంపి అరవింద్ సమక్షంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారిక సమావేశంలో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చ నియాంషంగా మారింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశా మీటీంగ్ లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. కాంగ్రెస్ పాలనలో కనీసం ఉన్నతాధికారులు కూడా ప్రోటోకాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మంత్రులు రాకుంటే అభివృద్ధి పనులు ప్రారంభించరా అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా జిల్లా ఇంచార్జి మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం 6 నెలలకు ఒకసారి అయినా జిల్లాకు రావడంలేదని ఆయన వల్ల జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందని, సెక్రటరియేట్ లో మంత్రి జూపల్లి పేషీ ని పెట్రోల్ పోసి తగలబెడతానని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలాసార్లు ఆయన పేషి నీ తగలబెడతానని హెచ్చరించారు. ఆర్మూర్ లో మంత్రి జూపల్లి నిర్లక్ష్యం వల్ల ఎన్నో పనులు ప్రారంభానికి నోచుకోకుండా మరుగున పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైడి కామెంట్స్ తో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేయడంపై అంతా సైలెంట్ గా ఉండిపోయారు. ఇదిలా ఉంటే ఆర్మూర్ లో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ వ్యవహరం శ్రుతిమించిందట. కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అయ్యాయని కొందరు లబ్దిదారులు అడుగగ, వీరిలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారని, ఇలా సంక్షేమ కార్యక్రమాల్లో నన్ను అడ్డూకుంటారా?ఇలా చేస్తే నేనేం ఊరుకోనని, ఇక్కడికి గన్ లైసెన్స్ తో వచ్చానని పైడి అనడంతో వివాదం ముదిరిపాకాన పడింది. ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డీ వ్యాఖ్యలతో కాంగ్రెస్-బిజేపి మద్య వార్ మరింత సీరియస్ అయింది. ఆర్మూర్ నియోజక వర్గంలో ఎప్పుడూ ఏం జరగనుందో అని టెన్షన్ నెలకొంది.

ఇక కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి వ్యవహరం కూడా నియోజక వర్గ ప్రజలకు అర్థం కావటం లేదు. ఎన్నికలకు ముందు తానూ ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పగా, తీరా ఎన్నికలయ్యాక వెంకట రమణా రెడ్డీ కామారెడ్డిలో కనిపిచటం లేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. హైదరాబాద్ వేదికగా నిత్యం ప్రెస్ మీట్లుసోషల్ మీడీయాలో హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో తానేందుకు ఎమ్మెల్యే అయ్యానో వ్యాఖ్యానించారు. దీంతో అసలు ఈయన్ను గెలిపించింది ఇందుకేనా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. నేరుగా సిఎం రేవంత్, డిప్యూటీ సిఎంలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. హైడ్రా అంశంలో బిజేపి స్టాండ్ ఏంటో ఇప్పటికి ఆ పార్టీ స్పష్టం చేయలేదని, కానీ వెంకట రమణారెడ్డి మాత్రం ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఒకసారి హైడ్రా మంచిదే అన్న ఆయన, మరోసారి పేదలను రోడ్డూకిడుస్తారాఅని కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా కామారెడ్డిలో ఉండకపోవటంతో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా హైదరాబాద్ కే పరిమితమై, ఒకరకంగా ఆయనే షబ్బీర్ అలీకి సందిచ్చారని ప్రజలు చెవులు కొరుక్కుంటూన్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు తాము ఏం చెప్పాలనుకుంటూన్నారో, లేక ఇలా నిత్యం వార్తల్లో నిలవటం వల్ల ప్రత్యేక గుర్తింపు వస్తుందని భావిస్తున్నారో తెలియదు కానీ పార్టీ అంతర్గత కలహల కారణంగా ఏదైనా చాన్స్ కోసం ముందుచూపుతో ఇలా చెస్తున్నారో అర్థం కావటం లేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేసి గెలిపిస్తే అభివ్రుద్ది కోసం ప్రభుత్వంతో కొట్లాడి పనులు చేస్తారనుకుంటే ఇలా పిట్టల దొరల్లా మాట్లాడుతున్నారని జనం నవ్వుకుంటున్నారు

More articles

Latest article