కామారెడ్డి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ
. . . రెండు సోనోగ్రఫీ యంత్రలు స్వాధీనం
. . . పలువురిని అదుపులోకి తీసుకున్న పోలిసులు
కామారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లాలో లింగ నిర్థారణ దందా కు కళ్లేం వేస్తున్నది వైద్య ఆరోగ్యశాఖ. పోలిసు శాఖతో కలిసి వైధ్య ఆరోగ్య శాఖ అలస్యంగా మెలుకున్న అటకట్టడం మాత్రం ప్రారంభించింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ సిందూ శర్మ అదేశాలతో హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో రెండు సోనోగ్రఫీ యంత్రలు స్వాధీనం చేసుకుని పలువురుని అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలొని అశోక్ నగర కాలనీలోని హిట్టం సిద్ధరాములు ఇంట్లో లింగనిర్ధారణ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లింగ నిర్ధారణలకు పాల్పడుతున్న ఇట్టం సిద్ధరాములకు మెమో జారీ చేసినట్టు తెలిసింది. కామారెడ్డి జిల్లాలో లింగనిర్ధారణకు సంబంధించి ఇప్పటికే గాందారీ మెడికల్ ఆఫీసర్ పై కేసు నమోదు కాగా , రాజంపేట్ మండల కేంద్రంలోనే పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.