30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మీ దొరల పాలన కాదు.. ఇది కాంగ్రెస్ ప్రజా పాలన

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రశాంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి
  • పిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్

 

మోర్తాడ్, బతుకమ్మ: బాల్కొండ  ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంకా టిఆర్ఎస్ అధికారం లో ఉంది అన్నట్లు భ్రమలో ఉన్నారాని ఆ భ్రమ నుంచి బయటకు రావాలని  ఆలోచన తీరు మార్చుకోవాలని పిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ ప్రశాంత్ రెడ్డి కి హితవుపలికారు.  బుధవారం మోర్తాడు మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇదేమైనా దొరల ప్రభుత్వం అనుకుంటునారా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులను మీ ఇంట్లో  పంచాలనుకోవడం  ఏంటి అదే మైన మీ గడి అనుకుంటున్నారా  గత 1Oఏళ్ల మీ పాలనలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులను మీ ఇంటికి పిలిపించి పంచినట్లు అనుకుంటున్నారా  అని పలికారు. ఇది పేదోడి పాలన ప్రజాపాలన  ఆ విషయాన్ని మరచిపోవద్దని  రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పాలకులు గాని అధికారులు గానీ లబ్ధిదారులకు దగ్గరికి వెళ్లాలి   లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో  చెక్కుల పంపిణీ చేయాలన్న విషయం తెలియదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. స్పష్టంగా  మీరు శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని గౌరవిస్తుంది మీ గత కేసీఆర్ పాలన లాగా  ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అగౌరపరీచినట్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, బద్దం రాజశేఖర్, మహిపాల్, నశీర్, చిన్న గంగారం,  నాగభూషణం, మహమ్మద్ అంజాద్, నవీన్, దొనకాల్ రవి, మహేష్,  ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article