24.2 C
Hyderabad

వేల్పూర్ కు రండి కనువిప్పు చేస్తాం

Must read

📰 Generate e-Paper Clip

  • పథకాలు అందినోళ్ళోతో మీరస్తే, పథకాలు అందనోళ్లతో మేం రెడీ
  • 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు, 420 హామీ ఏమైనవి
  • 600 రోజులైనా ఒక్క హామీ సక్రమంగా అమలు కాలే
  • పాలన గాలికొదలి నీచ రాజకీయాలు
  • ప్రజల పక్షాన ఎమ్మెల్యే ప్రశ్నిస్తే దిగజారుడు రాజకీయాలు చేస్తావా
  • కాంగ్రెస్ పార్టీకి ఇదే చరమ గీతం
  • డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ నాయకులు కనువిప్పు పేరిట వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించతలపెట్టిన కార్యక్రమానికి లబ్ధిపొందిన లబ్ధిదారులతో రావాలని, లబ్ది పొందని లబ్ధిదారులతో మేము రెడీగా ఉన్నామని, వారితో కాంగ్రెస్ నాయకులకు కనువిప్పు కలిగిస్తామని డీసీసీబీ డైరెక్టర్, మెండోరా మండల బీయర్ యస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో సవాల్ విసిరారు. పథకాలు అందినోళ్లతో మీరోస్తే, పథకాలు అందని వాళ్ళతో మేము రెడీగా ఉన్నామని మీరు వస్తే అక్కడే వాస్తవలను తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ప్రజలకు 6 గ్యారంటీలు, 420 హామీలను ఇచ్చి, అధికారంలోకి రాగానే 100రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటి 600 రోజులు గడుస్తున్న ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చెయ్యలేకపోయ్యారని ఆయన ఏద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన మీరు ప్రజల కోసం పని చేయాల్సింది పోయి కానిస్టెన్సీలో ఒకరంటే ఒక్కరని ఆధిపత్యం కోసం కొట్టుకుంటూ, పాలనను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే దిగజారుడు రాజకీయాలు చేయడానికి సిగ్గయినా ఉండాలని అన్నారు.ఇచ్చిన హామీలను గాలికొదిలి ఇష్టరీతిన మాట్లాడుతు చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలే కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ది చెబుతారని అన్నారు. మీరు అసంతృప్తిగా అమలు చేసిన రైతు రుణమాఫీ వల్ల రునమాఫీ కానీ రైతుల తో, గల్ఫ్ ఎక్స్ గ్రేసియా అందని గల్ఫ్ భాధితులతో, రైతు భరోసా అందని రైతులతో, 4000 పెన్షన్, 2500 అందని మహిళలతో, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలెండరు సబ్సిడీ అందని లబ్ధిదారులతో కనువిప్పు చేస్తామని ఆయన అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఇక చరమ గీతం పాడుతారని అన్నారు.

More articles

Latest article