24.7 C
Hyderabad
Monday, August 3, 2026

’కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తెలంగాణ తిరిగేలా చేశారు‘

Must read

📰 Generate e-Paper Clip

కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా..?

కేసీ ఆర్, రేవంత్ లకు కిషన్ రెడ్డి సవాల్

బీ ఆర్ ఎస్ పార్టీ శాసనమండలిని నిర్వీర్యం చేసింది

సంగారెడ్డి , బతుకమ్మ :  కల్వకుంట్ల కుటుంబం చుట్టూ మొత్తం తెలంగాణ తిరిగేలా పదేళ్లు పరిపాలన చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా..? అని కేసీఆర్ , సీఎం రేవంత్ రెడ్డిలకు ఆయన సవాల్ విసిరారు. పదేళ్ల మోదీ ప్రభుత్వం ఏం చేసిందో ఇద్దరు కలిసి వస్తే చూపిస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. రాష్ర్టంలో మారింది సీఎం, జెండా మాత్రమే అని పరిపాలన అలాగే ఉందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ప్రశ్నించే గొంతుకగా శాసనమండలిలో ఉంటారన్నారు. బీఆర్ ఎస్ పార్టీ శాసనమండలిని నిర్వీర్యం చేసిందన్నారు.

More articles

Latest article