24.2 C
Hyderabad

ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీముకు క్యాష్ రివార్డ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఒడిశా నుంచి మహారాష్ర్టకు తరలిస్తున్న రూ.20లక్షల విలువైన గంజాయిని పట్టుకున్న నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీమును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమలహాన్ రెడ్డి అభినందించి క్యాష్ రివార్డును అందజేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని డైరెక్ట రేట్ కార్యాలయంలో నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్నతోపాటు టీముకు రూ.30వేల క్యాష్ రివార్డును కమలహాసన్ రెడ్డి అందజేశారు.  అందులో రూ.10వేల క్యాష్ రివార్డును సీఐ స్వప్నకు, రూ.20వేల క్యాష్ రివార్డును ఎన్ ఫోర్స్ మెంట్ టీముకు అందజేశారు. ఈనెల 11న బాన్సువాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంసాగర్ వద్ద 91 కిలోల గంజాయిని పట్టుకున్నందుకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీముకు క్యాష్ రివార్డుతోపాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఖురేషీ, నిజామాబాద్ డీసీ సోమిరెడ్డి, ఎన్ ఫోర్స్ మెంట్ టీము పాల్గొన్నారు.


Cash reward for Excise Enforcement Team

More articles

Latest article