27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నలుగురు టీచర్ల ఒక రోజు వేతనం కట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ఫూలాంగ్ యూపీఎస్ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఉపాధ్యాయుల వేతనంలో ఒక రోజు కోత విధిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 6వ తేదీన జిల్లా విద్యాశాఖాధికారి ఫూలాంగ్ యూపీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేయగా స్కూల్ అసిస్టెంట్ భారతి, ఎస్జీటీలు పద్మావతి, విజయశాంతి, కరుణ శ్రీ పాఠశాలలో లేకపోవడంతో డీఈవో ఆరా తీసి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారు నోటీసులకు ఇచ్చిన సమాధానం మేరకు ఒక రోజు వేతనాన్ని కట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంకు వార్నింగ్

ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం శ్రీనివాస్ డిసెంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు విధులకు గైర్హాజరు కావడంతో ఆయనకు డీఈవో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్లారెడ్డిపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం ఫిర్యాదు మేరకు మూడు రోజుల వేతనాన్ని కట్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

More articles

Latest article