27.3 C
Hyderabad
Friday, July 31, 2026

మురికి కాలువ మూసేసి గుడిసెను వేశారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మా ఇళ్ళలోకి మురికినీరు వస్తుంది

 

. . . అక్రమంగా డ్రైనేజి కాలువను మూసివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

 

. . . ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇళ్ళ మధ్య ఉన్న మురికి కాలువను మూసివేసి అక్కడ అక్రమంగా గుడిసెను నిర్మించడం వలన మురుగునీరు ఇళ్ళలోకి వస్తుందని దాని వల్లే ఇబ్బందులు పడుతున్నామని  రెంజల్ మండలం కూనెపల్లి గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రెంజల్ మండలం కూనెపల్లి గ్రామానికి చెందిన రాజాగౌడ్, చిన్న సాయిగౌడ్, ఎనుగంటి చంద్రమ్మలు ప్రజావాణిలో గ్రామ సర్పంచ్ మేనకోడలు, ఆమె భర్త కలిసి తమ ఇళ్ళ మధ్య ఉన్న కాలువను అక్రమంగా మూసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలువను మూసివేయడం వల్ల మురుగునీరు తమ ఇళ్ళలోకి వస్తుందని గుడిసెను తొలగించాలని కాలువను పునరుద్దరించాలని కోరితే తమపై దాడి చేసేందుకు వస్తుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి తమ 8 కుటుంబాలకు ఇబ్బందికరంగా మారిన కాలువ పూడ్చివేత, అక్రమ గుడిసె నిర్మాణంను తొలగించి కాలువను పునరుద్దరించి, మురుగనీరు పోయేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.

More articles

Latest article