నేను కట్టిన ఇంట్లోకి నన్నే రానిస్తలేరు

0 1,521
  • ప్రజావాణిలో ఫిర్యాదుకు వచ్చిన వృద్దురాలిని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తాను కట్టుకున్న ఇంట్లోకి తనను రానివ్వడం లేదని ఇద్దరు కొడుకులున్నా కనీసం తిండి కూడా పెట్టడం లేదని ఓ ముసలమ్మ ప్రజావాణిలో ఫిర్యాదు కోసం వచ్చింది. కానీ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను కలెక్టర్ ను కలువకుండానే అడ్డుకుని వెనక్కి తీసుకెళ్లిన ఘటన సోమవారం జరిగింది. నవీపేట్ మండలం కోస్లీ, ఫకీరాబాద్ కు చెందిన గుడ్డి ముత్తెమ్మ(65)కు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు. అందరికీ వివాహాలు చేసి హాయిగా జీవిస్తున్నప్పటికీ తనను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని ముత్తెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తెలియకుండానే తన భర్త పేరుపై ఉన్న రెండు ఎకరాల పొలాన్ని కొడుకులు పట్టాలు చేయించుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు. ముగ్గురు కొడుకులు ఉన్నా తిండి పెట్టడం లేదని, కనీసం తాను కట్టిన ఇంట్లోకి రానివ్వకుండా వాకిలికి పరిమితం చేశారని వాపోయారు. ప్రజావాణిలో ఫిర్యాదు కోసం రాగా కొడుకులు, బంధువుల ద్వారా కలెక్టర్ ను కలువకుండానే వెనక్కి తీసుకెళ్లడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.