కరీంనగర్, బతుకమ్మ: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా బిజేపి అభ్యర్థి మల్కా కొమురయ్య ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉదయం నుంచి కొమురయ్య తన అధిపత్యం కొనసాగించారు. ఐతే ప్రాధాన్యత క్రమంలో మొదటి, రెండవ విడత ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవ్వరికి రాలేదు. ప్రాధాన్యత క్రమంలో 12 వేలకు మించి ఓట్లను సాధించిన వారిని విజేతలుగా ప్రకటించారు. బిజెపి అభ్యర్థి కొమురయ్యకు 12,959, పిఆర్ టియు అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి 7182, టిపిటిఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్ కు 2621, ఎస్ టి యూ అభ్యర్థి కూర రఘోత్తం రెడ్డికి 428ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లు 25041 కాగా 897 ఓట్లు చెల్లలేదు. 24144 ఓట్లను లెక్కించి గెలుపు కోటాను చేరిన బీజేపీ అభ్యర్థి మల్కకొమురయ్యను విజేతగా ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలాసత్పతి బీజేపీ అభ్యర్థి కొమురయ్య గెలిచినట్లు ప్రకటించారు.
