నేను కట్టిన ఇంట్లోకి నన్నే రానిస్తలేరు
ప్రజావాణిలో ఫిర్యాదుకు వచ్చిన వృద్దురాలిని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తాను కట్టుకున్న ఇంట్లోకి తనను రానివ్వడం లేదని ఇద్దరు కొడుకులున్నా కనీసం తిండి కూడా పెట్టడం లేదని ఓ ముసలమ్మ ప్రజావాణిలో ఫిర్యాదు కోసం వచ్చింది. కానీ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను కలెక్టర్ ను కలువకుండానే అడ్డుకుని వెనక్కి తీసుకెళ్లిన ఘటన సోమవారం జరిగింది. నవీపేట్ మండలం కోస్లీ, ఫకీరాబాద్ కు చెందిన గుడ్డి ముత్తెమ్మ(65)కు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు. అందరికీ వివాహాలు...