30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

భవిష్యత్ లో బీఆర్ఎస్ పార్టీ ఉండదు

Must read

📰 Generate e-Paper Clip

కాళేశ్వరం కమిషన్ విచారణ పై అనుమానాలు

కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కనిపించటం లేదు

బీజేపీ శాసనపక్ష ఉపనాయకులు ఎమ్మెలే పాయల్ శంకర్

నిజామాబాద్, బతుకమ్మ:  భవిష్యత్ లో రాష్ట్రంలో బీఆర్ ఎస్ పార్టీ ఉండదని, ఆస్తుల గొడవలతో పార్టీ కూరుకు పోయిందని బీజేపీ శాసనపక్ష ఉపనాయకులు ఎమ్మెలే పాయల్ శంకర్ వ్యాఖ్యనించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో తప్పులు చేసిన వాళ్లకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణ పై అనుమానాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీ లు కలిసి డ్రామా ఆడుతున్నట్లు అనుమానం ఉందన్నారు.  కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  కాళేశ్వరం కమీషన్ డబ్బులు విదేశాలకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కనిపించటం లేదని, అందుకే ఆ పార్టీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. దేశ రక్షణ వ్యవస్థపై దేశ ద్రోహుల్లా మాట్లాడటం బాధాకరమన్నారు. 11 ఏళ్లలో ప్రధాని మోదీ పరిపాలనలో దేశ రక్షణ వ్యవస్థ మరింత బలంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ. 10 లక్షల 50 వేల కోట్లు కేంద్రం విడుదల చేసిందన్నారు. ప్రజలు  బీఆర్ ఎస్ పార్టీ ని బొంద పెట్టారని, కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article