హైదరాబాద్, బతుకమ్మ : యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బుధవారం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. కాగా, ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముకకు గాయమైన విషయం తెలిసిందే. ఆయన వెంట మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, నాయకులు ఉన్నారు.
