. . . ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్
బోధన్, బతుకమ్మ :
ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే యాసంగి సీజన్ కు ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుంచి ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి అన్నారు. బోధన్ మండలం మావందిఖుర్దు గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిలువ ఉన్న ఎరువులను పరిశీలించారు. స్టాక్ బోర్డు ను ప్రదర్శించిన వివరాలకు అనుగుణంగా నిల్వలు ఉన్నాయా అని గమనించారు. యాసంగి సీజన్ లో ఎంత మొత్తంలో యూరియా ఎరువుల అవసరం పడుతుందని ఆరా తీశారు. స్టాక్ కొంత మిగిలి ఉండగానే, ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రైవేట్ డీలర్లు కూడా నిబంధనలను పాటిస్తూ, ఎరువుల విక్రయాలు జరిపేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు.. ఎలాంటి పొరపాట్లు తావులేకుండా సజావుగా ఎరువుల పంపిణీ జరగాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక వ్యవసాయ, సోసైటి అధికారులు ఉన్నారు.
