25.5 C
Hyderabad

జిల్లాలో బీసీ చైతన్యం అధికంగా ఉంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో బీసీ చైతన్యం అధికంగా ఉందని, దేశంలో ఎక్కడ బీసీలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినా జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొని తమ గళాన్ని వినిపించడం ఆనందంగా ఉందని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన 11వ ఓబీసీ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు ద్వారా బీసీలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది నిర్వహించే జాతీయ మహాసభల్లో ఈసారి కూడా జిల్లా నుంచి విశేషంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల హక్కులు, అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో కరిపె రవీందర్, కొయ్యాడ శంకర్, మాడవేడి వినోద్ కుమార్, చంద్రకాంత్, శ్రీలత, ఆర్టీసీ శ్రీనివాస్, చంద్రమోహన్, భూమన్న, రవి, బాలన్న శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

 

There is a high level of BC consciousness in the district.

More articles

Latest article