బోధన్, బతుకమ్మ : ట్రాన్స్ ఫార్మర్ ను ధ్వంసం చేసి అందులో ఉన్న సామాగ్రిని దొంగింలించిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో వ్యవసాయ భూములకు ఉపయోగపడే ట్రాన్స్ ఫార్మర్ వైర్లను కట్ చేసి ధ్వంసం చేశారు. ట్రాన్స్ ఫార్మర్ ను ధ్వంసం చేసి అందులోని విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారని స్థానిక వ్యవసాయ రైతులు తెలిపారు.
