రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

0 1,441
  • బైకును ఢీ కొట్టిన లారీ
  • ఘటనస్థలంలో దంపతుల మృతి

బతుకమ్మ, నవీపేట్ : మండల కేంద్రంలోని మిషన్ భగీరథ ట్యాంకు సమీపంలో బాసర ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన బైక్ లారీ ప్రమాదం లో భార్య భర్త లు మృతి చెందిన సంఘటన చోటు చేసింది. ప్రమాదంలో మండలం లోని ఫకీరాబాద్ కు చెందిన భార్యాభర్తలు మగ్గడి లక్ష్మణ్ (57) మగ్గడి రాజమణి (52) ఘటన స్థలంలో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి కూలిపనులు ముగించుకొని అబ్బపూర్ ఎం లో కూతురు తనూజ దగ్గరికి వెళ్లి స్వగ్రామం ఫకీరాబాద్ కు ద్విచక్ర వాహనం పై వెళ్లుచుండగా మార్గమధ్యలో నవీపేట్ శివారులోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ సమీపంలో బాసర వైపు నుండి నిజామాబాదు వైపు వస్తున్న లారీ ఢీకొట్టగా ఘటన స్థలంలోని మృతి చెందారు.ఎస్. ఐ. వినయ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేరుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు.

Leave A Reply

Your email address will not be published.