33.2 C
Hyderabad

కమ్మర్ పల్లిలో రెండిళ్లలో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

  • భారీగా నగదు అపహరణ

 

 కమ్మర్ పల్లి, బతుకమ్మ: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మినుముల గంగాధర్, వంకార్ శ్రీనివాస్ కుటుంబాలు ఇంటికి తాళం వేసి వెళ్లగా ఈ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగుల గొట్టి గంగాధర్ ఇంటిలో రూ.5 లక్షల నగదు, ఆర తులం బంగారం, శ్రీనివాస్ ఇంట్లో  రూ.20 వేల నగదు, ఆరతులం బంగారు నగలను చోరీ చేశారు. శనివారం ఉదయం ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి చోరీ జరిగిన ఇండ్లను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Theft in two years in Kammer Pally

More articles

Latest article