28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • టీయుసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీయుసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలోని శ్రామిక భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయుసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో, జిల్లాల్లో సంఘటిత, అసంఘటిత కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. అతి తక్కువ వేతనాలు కూడా, నెలల తరబడి జీతాలు పెండింగులో పెట్టడం  కార్మికులను హింసించడమే అవుతుందన్నారు.  జీతాలు, ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్. తదితర చెల్లింపుల గురించి కార్మికులు అడిగితే పనిలో నుండి తొలగిస్తామని బెదిరించడం నిత్యకృత్యమైందన్నారు. మున్సిపల్, కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్, గ్రామపంచాయతీ, మిషన్ భగీరథ, హాస్పిటల్, ఆశ అంగన్వాడి, మధ్యాహ్న భోజనం కార్మికులు మరియు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం మరియు ఏజెన్సీల కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక వేదనకు  గురిచేస్తున్నారన్నారు. జీతాల్లో అక్రమ కోతలు, పనిభారం పెంచారు. గ్రామ పంచాయతీ, ఆటో, హమాలీ కార్మికులకు, కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బందికి సామాజిక భద్రతను కల్పించాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికి సుదీర్ఘ కాలంగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) రాష్ట్ర వ్యాపితంగా కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలను నిర్వహించిందన్నారు. ఈనెల 31న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ నెల 31న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని జిల్లాలోని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.  ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు డి. రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్, జిల్లా కోశాధికారి పి.సాయరెడ్డి, జిల్లా నాయకులు మురళి, లింగం, రవికుమార్, రెహనా, గంగన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article