కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

టీయుసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీయుసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలోని శ్రామిక భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయుసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో, జిల్లాల్లో సంఘటిత, అసంఘటిత కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కార్మికులకు కనీస వేతనాలు...