26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రైతుల ధాన్యం రక్షణ కోసమే గోదాం నిర్మాణం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి

 

లింగంపేట్ బతుకమ్మ

 

రైతులు పండించిన ధాన్యానికి రక్షణగా ఉండటానికే గోదాంల నిర్మాణం చేపడుతున్నామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు వెల్లడించారు. లింగంపేట మండల కేంద్రంలో 30 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న గోదాం నిర్మాణం పనులను ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రైతులు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షాల కారణంగా తడిసి నష్ట పోతున్న సమస్యను ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించి లింగంపేట్ పట్టణంలో రూ.30 లక్షల వ్యయంతో గోదాం నిర్మాణానికి ఆమోదం పొందారు. ఈ నేపథ్యంలో గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ భూమిపూజ నిర్వహించారు. గోదాం నిర్మాణంతో రైతులు తమ పంటను సురక్షితంగా నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రధానంగా అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ధాన్యం తడిసి నష్టపోకుండా నిలువ చేసుకోవడానికి ఈ గోదాం రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండోసారి మొక్కజొన్న కొనుగోలు జరిగేలా కృషి చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి సమస్య పరిష్కారం చేసినట్లు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పైలట్ ప్రాజెక్టును తీసుకువచ్చి రీ-సర్వే జరిగేలా కృషి చేశానని, అసెంబ్లీలో కూడా అనేకసార్లు ఎల్లారెడ్డి రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనే నమ్మకంతోనే నేను పని చేస్తున్నానన్నారు. రైతుల కష్టానికి విలువ తీసుకురావడం, వారు పండించిన పంటను సురక్షితంగా భద్రపరుచుకునే వసతులు కల్పించడం నా బాధ్యత అన్నారు. లింగంపేట్ గోదాం నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులు తమ ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుందని, రైతుల అభ్యున్నతి కోసం నేను నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వారి ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషికి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ గోదాం నిర్మాణం లింగంపేట్ ప్రాంత రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట గ్రామ సర్పంచ్ కౌడ రవీందర్, మండల పార్టీ అధ్యక్షుడు సాయిరాం యాదవ్, మాజీ అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్, ఎంపీడీవో బ్రహ్మానందం, తాసిల్దార్ సురేష్, వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్, సహకార సంఘం చైర్మన్ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లమయ్య రఫిక్ సంద బాలయ్య, దురిశెట్టి అశోక్ ఎల్లాడి నియోజకవర్గ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్ తో పాటు ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

The warehouse is being constructed solely to protect the farmers' grain.

More articles

Latest article