. . . తాసిల్దార్ బాలయ్య ఆదేశాలు
ఇందల్వాయి, బతుకమ్మ :
మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న మీసేవ కేంద్రాలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలని ఇందల్వాయి తహసిల్దార్ బాలయ్య ఆదేశించారు. ఈ మేరకు ఆయన మీసేవ కేంద్రా నిర్వాకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీ సేవ నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు కేవలం మీ సేవ కేంద్రాల ద్వారానే ప్రజలకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందుకు అనుగుణంగానే ప్రతి మీ సేవ కేంద్రం నిర్వాహకుడు కృషి చేయాలని ఆయనన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే తీసుకోవాలని అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ సేవ నిర్వాహకులు కొందరు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు అదనంగా వసూలు చేస్తున్నారని తమ దృష్టికి రావడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని మెసులుకోవాలని ఆయన హెచ్చరించారు. లేని ఎడల మీసేవ కేంద్రాల అనుమతులు రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శైలజ, రెవిన్యూ ఇన్స్ పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
