26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బీఎల్ఓ లకు కిట్లు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి నిర్వహించనున్న బూత్ లెవెల్ అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి బీ ఎల్ ఓ కిట్లు అందజేశారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుండి ఈ కిట్లు కేటాయించగా, కలెక్టర్ మంగళవారం తన ఛాంబర్ లో జిల్లా అధికారులతో కలిసి బీఎల్ఓ లకు అందించారు. పారదర్శక ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఈ సందర్భంగా బీ ఎల్ ఓ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Kits distributed to BLOs

More articles

Latest article