- కేటీఆర్ కడిగిన ముత్యం లా బైటికి వస్తారు
- ఈ లోట్టపీసు కేసులు ఏం చెయ్యలేవు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ముఖ్యమంత్రి తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మల్లించడానికి కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టి, ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని,నిజం నిప్పులాంటింది నిజం నిలకడగా బైటకు వస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన హైద్రాబాద్ లోని కేటీఆర్ నివాసం వద్ద ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత 13, 14 నెలాలుగా రాష్ట్ర పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఏ ఒక్కదాన్ని తీర్చలేకపోయారని, ఆ విషయం రాష్ట్ర ప్రజలు ఇబ్బడి ముబ్బాడిగా చెప్పుకుంటుండగా, ఆ ప్రజల దృష్టిని మల్చడానికి గత రెండు నెలాలుగా ఈ కార్ రేస్ ను ముందటేసుకొన్నాడని ఆయన ఆరోపించారు. తెలంగాణ స్టేట్ ఇమేజ్ పెంచడానీకాని రాష్ట్రానికి ఈ కార్ రేస్ ను కేటీఆర్ తీసుకొస్తే దాన్ని కాస్త రద్దు చేసి, ఎప్పుడో జరిగిన ఈ కార్ రేస్ లో ఏమో జరిగిందని, ఎవరో ఇచ్చారని, ఏదో ఇచ్చారని తప్పుడు కేసు పెట్టేందుకు సీ. ఎం ప్లాన్ చేసారన్నారు.ఈ కార్ రేస్ ప్రాజెక్ట్ ను తీసుకువచ్చేందుకు ఎందరో సీ. ఎం లు, పీ. ఎం ప్రయత్నం చేస్తుంటే ఆలాంటి ప్రాజెక్టు లో ఏదో జరిగిందని తప్పుడు కేసు పెట్టి కేటీఆర్ ను ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుందని అన్నారు.ఈ ప్రభుత్వం పెట్టె ఈ కేసులో ఏమి లేదని,ఆదో చెత్త లోట్ట పీస్ కేసని,దీనితో అయ్యేది ఏమి లేదని, పొయ్యేది ఏమి లేదని ఆయన ధ్వజమెత్తరు. మా నాయకుడు కేటీఆర్ కడిగిన ముత్యంలా బైటికి వస్తారని అన్నారు.ఏదో ఒక్కటి దొరితే కేసు చేద్దామని చూస్తుండ్రు కానీ రెండు నెలలుగా ఏమి దొరకక పోగా ఇప్పుడు ఎలక్ట్రోల్ బాండ్స్ కు లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎలక్ట్రో బాండ్స్ అన్ని పొలిటికల్ పార్టీస్ సేకరిస్తాయని అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు.మరి ఈ గ్రీన్ కో కంపెనీ కాంగ్రెస్ పార్టీకి కూడా వేల కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చారని మరి ఆవి ఎక్కడివని , ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఏది ఏమైనా ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలు అందరూ వెంట పడతారని ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
