30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నఫ్రత్ చోడో ..  నిజామాబాద్ జోడో..

Must read

📰 Generate e-Paper Clip

  •  స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలి
  • రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి దీపదాస్ మున్షి 

 

నిజామాబాద్, బతుకమ్మ :  నఫ్రత్ చోడో నిజామాబాద్ జోడో అనే నినాదంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి దీప్ దాస్ మున్షీ అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు కార్యకర్తల సమావేశం మంగళవారం డిచ్ పల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసిసి ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, ప్రోటోకాల్ ఇన్ ఛార్జ్ వేణుగోపాల్,ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు లు పాల్గొన్నారు. సమావేశానికి ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా దీప్ దాస్ మున్షి మాట్లాడే సమయానికి కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు కష్టపడాలన్నారు. వేదికమీద ఉన్న, కింద ఉన్న అందరూ ఒకటేనని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లే ప్రధాన శత్రువులన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ  నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు క్షమించరానివన్నారు. పీసీసీ చీఫ్ గా నిజామాబాద్ కు చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేయబడిందని, త్వరలోనే జిల్లాకు  మంత్రి పదవిని ఇస్తారని అన్నారు.

Nafrat Chodo .. Nizamabad Jodo ..

  •  పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు దక్కుతాయి : టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ 

టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ  పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం పాలన కంటే పది రెట్ల అభివృద్ది  కాంగ్రెస్ ఏడాదిలో పాలనలో జరిగిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లు గెలవాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు దక్కుతాయన్నారు. 2 లక్షల రుణ మాఫీ కి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కొన్ని సాంకేతిక కారణాల వలన కొంత మందికి  రుణ మాఫీ జరగడంలో జాప్యం జరిగిందన్నారు. 2014కి ముందు కవిత ఆర్థిక స్థితిగతులు ఏంటి? సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు.  బిఆర్ఎస్ ఏడాదికి 5 వేల ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ నెలకు 5 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. 65 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రులు చేసిన అప్పు కంటే పదేళ్లలో కేసిఆర్ 7 లక్షలకు పైగా కోట్ల అప్పు చేసిండన్నారు. రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి చేసే లక్ష్యంగా అందరం అహర్నిశలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అనుచిత వ్యాఖ్యలు ఖండించ్చాల్సిన కేంద్ర  మంత్రి కిషన్ కిషన్ రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్ రేసులో అక్రమాలు జరిగాయని, జైలుకు వెళ్ళడానికి సిద్ధమన్న కేటిఆర్ ఇపుడు మాట మార్చారన్నారు. సుప్రీం కోర్టు కు వెళ్లినా తప్పించుకోలేరన్నారు.

Nafrat Chodo .. Nizamabad Jodo ..

  • మరో పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండాలి : జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణ రావ్ 

10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి మరో పదేళ్ల అధికారంలో ఉండాలని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణ రావ్ అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరికి న్యాయం జరుగుతుందని, కార్యకర్తలు నిరాశ, నిస్పృహకు లోను కాకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని సూచించారు. కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 6800 కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని అప్ప జెప్పారని, 60 ఏళ్ల కల తెలంగాణ ఇస్తే ధనిక రాష్ట్రంను కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. కలిసికట్టుగా, సమిష్టిగా కలిసి ఉండి రెండు, మూడు మాసాలు కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు.

  • పంట పండించిన వారికి రైతు భరోసా నిర్ణయం సరైంది  :  ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ

పంట పండించిన వారికి రైతు భరోసా నిర్ణయం సరైందేనని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు త్వరలో న్యాయం జరుగుతుందని, స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటిసి, జడ్పిటిసిలుగా గెలుపించుకుందామన్నారు. కేసీఆర్ 10ఏళ్ల పాటు ప్రజాధనం వృధా చేశారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ సింగ్ సంతాప సభ కు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదన్నారు. కేటీఆర్ హైకోర్టులో వేసిన ఫాస్ట్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసిందని ఆయన ఏసీబీ ముందు హాజరుకావాల్సిందేనన్నారు.  ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాటిపర్తి  జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, సంజయ్ కుమార్ లతో పాటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ, కార్పొరేషన్ల  చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, తాహెర్,  ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డిలతో పాటు నియోజకవర్గ ఇంచార్జిలు వినయ్ రెడ్డి, సునీల్ కుమార్ పాల్గొన్నారు.

More articles

Latest article