29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పుచ్చ లేచిపోతుంది.. నిరంజన్ రెడ్డికి కవిత వార్నింగ్

Must read

📰 Generate e-Paper Clip

వనపర్తి, బతుకమ్మ : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నిరంజన్ రెడ్డి తన తండ్రి వయసు వారని ఇన్నాళ్లు తాను ఏమి అనలేదని, ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకేనేది లేదని కవిత హెచ్చరించారు. తనను ఉద్దేశించి పుచ్చు వంకాయ, సచ్చు వంకాయ అని నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారట.. ఇన్నాళ్లు మీ వయసుకు గౌరవించాను. ఇంకోసారి నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని నిరంజన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం వనపర్తిలో కవిత మీడియాతో మాట్లాడితూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరంజన్ రెడ్డి అవినీతి, అక్రమాలతో వనపర్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. నిరంజన్ రెడ్డి స్థానిక తహసీల్ కార్యాలయాన్ని దగ్ధం చేస్తుంటే చూస్తు ఉండిపోయారన్నారు. నిరంజన్ రెడ్డి అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. హరీశ్ రావు మనిషి కావడం వల్లే నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తాను నమ్ముతున్నానన్నారు.

More articles

Latest article