26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రం అంధకారం

Must read

📰 Generate e-Paper Clip

  • ఏం సాధించారని విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు
  • ముఖ్యమంత్రి కార్యాలయానికి బహిరంగ లేఖ రాసిన అర్బన్ ఎమ్మెల్యే

 నిజామాబాద్ సిటీ బతుకమ్మ : రాష్ట్రంలో ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి ప్రశ్నలతో కూడిన లేఖను రాసి జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా లెటర్ పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గతేడాది కాలంలో ప్రజలకు ఎంతవరకు అందజేశారో సమాధానం చెప్పాలన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, నిరుద్యోగ భృతి, అంబేద్కర్ అభయహస్తం, కార్పొరేషన్ల అభివృద్ధికి రూ.750 కోట్ల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యా జ్యోతి పథకం, బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20వేల కోట్ల నిధులు, గల్ఫ్ లో మరణించిన వారికి రూ.5 లక్షలు తదితర హామీలను విస్మరించారని అన్నారు. మొత్తం 26 ప్రశ్నలతో కూడిన లేఖలు రాసి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. వీటన్నింటికీ సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

The state was in darkness during the one-year rule of the Congress

More articles

Latest article