29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను అర్బన్ పరిధిలో పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జ్‌ లు, బిఎల్ఎ సూపర్‌వైజర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నూడా చైర్మన్ కేశ వేణు, ఎస్ఆర్ అర్బన్ కోఆర్డినేటర్ ఆకుల లలిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గమైన నిజామాబాద్ అర్బన్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం ప్రతి నాయకుడి బాధ్యత అని అన్నారు. ఇందుకోసం ప్రతి డివిజన్‌కు మెంటర్లను నియమించామని తెలిపారు. డివిజన్‌లలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పార్టీ నాయకులంతా అక్కడే అందుబాటులో ఉండి ఓటర్లకు దరఖాస్తు ఫారాలు నింపడంలో సహాయం చేయాలని సూచించారు. ప్రత్యేక శిబిరాలు నిర్వహించడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు సేకరించి వాటిని నింపించేందుకు వాలంటీర్లను నియమించాలని ఆదేశించారు. కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, కార్పొరేటర్లు, బిఎల్ఎ సూపర్‌వైజర్లు తమ తమ డివిజన్‌లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రతి ఓటరికి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రత్నాకర్, జావీద్ అక్రమ్, అర్బన్ ఈఆర్ఓ కోఆర్డినేటర్ అబ్దుల్ వహీద్, డీసీసీ ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, డీసీసీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు విజయ్ పాల్ రెడ్డి, సలీం, కోశాధికారి సకినాల శివతో పాటు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జ్‌ లు, బిఎల్ఎ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

 

The SIR process must be made successful.

More articles

Latest article