29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పీఆర్ టీయూ మోపాల్ మండల అధ్యక్షుడిగా కొట్టూరు దేవిదాస్

Must read

📰 Generate e-Paper Clip

 

మోపాల్, బతుకమ్మ :

 

పీఆర్ టీయూ మోపాల్ మండల అధ్యక్షుడిగా రెండవసారి కొట్టూరు దేవిదాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పీఆర్ టీయూ మండల పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. అధ్యక్షులుగా కొట్టుర్ దేవదాస్, ప్రధాన కార్యదర్శి గా ఎం.రాజశేఖర్, అసోసియేట్ అధ్యక్షులుగా గోవింద్, ఉపాధ్యక్షులుగా రమేష్ కుమార్, చంద్రు, మహిళ అసోసియేట్ అధ్యక్షురాలుగా ఘంటా మాధవి, ఉపాధ్యక్షులుగా విజయలక్ష్మి, నీరజ, కార్యదర్శులుగా సుధాకర్, నరేష్, మహిళా కార్యదర్శిలుగా దీపారెడ్డి, సువర్ణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగోనే కిషన్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పెంట జలంధర్, ఎం.వెంకటేష్ గౌడ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అంకం నరేష్, గౌరవ అతిధులుగా మోపాల్ మండల విద్యాశాఖ అధికారి సాయిలు, మండల తహసీల్దార్ రేఖ, రాష్ట్ర బాద్యులు శంకర్, హరి చరణ్, ఎన్నికల అధికారిగా ఎం.లక్ష్మీనారాయణ, పీఆర్టియూ మాక్లూర్ మండల ప్రధాన కార్యదర్శి  వ్యవహరించారు. ఈ సందర్భంగా రెండవసారి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొట్టూర్ దేవిదాస్ మాట్లాడుతూ, మండలంలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని వెల్లడించారు. తనపై ఎంతో నమ్మకంతో రెండవసారి మండల అధ్యక్షునిగా గెలిపించినందుకు దేవదాస్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి సహాయ సహకారాలతో పీఆర్ టీయూ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయనన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీని  సర్వసభ్య సమావేశానికి హాజరైన అతిథులు అభినందించారు.

More articles

Latest article