ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి

0 8,607

 

. . . పాఠ్యపుస్తకాల ధరలను నియంత్రించాలి

 

. . . టిఎన్ఎస్ఎఫ్, టీజేఎస్ నాయకులు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని, వాటి గుర్తింపును రద్దు చేయాలని టిఎన్ఎస్ఎఫ్, టీజేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం టిఎన్ఎస్ఎఫ్, టీజేఎస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, టీజేఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ లు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నారని, మార్కెట్ లో దొరికే ధర కంటే ఎక్కువ ధరలకు పుస్తకాలను అమ్మి దోపిడీకి పాల్పడుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారికి తెలిపారు. వెంటనే ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.