28.4 C
Hyderabad

అంగన్ వాడీ కేంద్రాలకు  బతుకమ్మ, దసరా పండగ సెలవులు

Holidays for Anganwadi centers for Bathukamma and Dasara festivals

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 12 రోజుల సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

. . . లబ్ధిదారులకు ముందస్తుగానే టేక్‌ హోమ్‌ రేషన్‌ పంపిణీకి అనుమతి

 హైదరాబాద్, బతుకమ్మ:

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు అక్టోబర్‌ 10 నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల కాలంలో లబ్ధిదారులకు సాధారణంగా అందించే వేడి భోజనం (హాట్‌ కుక్‌డ్‌ మీల్‌)కు బదులుగా టేక్‌ హోమ్‌ రేషన్‌ ( టిహెచ్ఆర్) పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చారు. అక్టోబర్‌ 22 నుంచి రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయి. ఈ మేరకు తమ పరిధిలోని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, హెల్పర్లకు అవసరమైన సూచనలు జారీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారులు (డి డబ్ల్యూ ఓ), శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు (సిడిపిఓ)లను శాఖ ఆదేశించింది.

ప్రభుత్వ స్కూల్ టీచర్ ల మాదిరిగానే తమకు బతుకమ్మ, దసరా సెలవులు మంజూరు చేసినందుకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. అంగన్వాడీ చరిత్రలో మొదటిసారిగా దసరా సెలవులు ఇచ్చి అంగన్వాడీ టీచర్ ని హెల్పర్స్ ని బతుకమ్మ సంబరాలు సంబరంగా చేసుకోమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కి ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐ ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షురాలు డి అన్నపూర్ణ ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article