. . . అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే భూపతిరెడ్డి
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కస్పమోహన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందగా విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి చలించి అంత్యక్రియలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడి కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర వహించిన ముఖ్య నాయకులలో కస్ప మోహన్ ఒకరిని ఆయన అభివర్ణించారు. ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీకి మోహన్ మృతి తీరని లోటని అభివర్ణించారు. ఆయన మృతి పట్ల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి తలారి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, కరుణాకర్, ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ సుజాత శేఖర్, మాజీ సర్పంచ్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.

