23.7 C
Hyderabad

జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం  చేసిన వ్యవసాయ కార్మిక రైతు సంఘం

Agricultural Workers and Farmers' Union burns effigy of Gyanesh Kumar

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

ఎన్నికల కమిషనర్  జ్ఞానేశ్ కుమార్ తన పదవికి  రాజీనామా చేయాలని సిఐటియు  అనుబంధ వ్యవసాయ కార్మిక  రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శనివారం ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించి జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు  పెద్ది వెంకట్ రాములు,వెంకటేష్, శంకర్ గౌడ్, రమేష్ బాబు లు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా పనిచేస్తూ ప్రజల హక్కుగా ఉన్న ఓటు హక్కులు 13 కోట్ల ఓట్ల రద్దు చేయడం  దుర్మార్గమని అన్నారు. జ్ఞానేశ్ కుమార్ బిజెపి పార్టీ వంత పాడుతున్నారు అని విమర్శించారు. కాబట్టి ఈరోజు దేశంలో ప్రజలందరూ ఆయన రాజీనామా చేయాలని నిరసన పెద్ద ఎత్తున చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజలకు వెన్నుముకగా నిలవాల్సిన ఎలక్షన్ కమిషన్ ఈరోజు అవకాశవాదం గా వ్యవహరిస్తుందని రాజ్యాంగ వ్యవస్థను కూలదోస్తుంది ప్రజల హక్కులను కాలరాత్రి విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన యువకులను రాజకీయ పార్టీల నాయకులు నిరోధించటానికి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పోలీసులు మిలిటరీని ప్రయోగించి నిర్బంధాలను చేస్తూ ప్రజల గొంతు నొక్కాలని చేస్తున్నారని అన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని రాజ్యాంగంలో ప్రజలకు ఉన్న హక్కులను కాల రాయాలని చూడటం, నియంతృత్వ విధానానికి దారితీస్తుందని అనేకమంది నియంతలు ప్రజల ఆగ్రహానికి గురై కాలగర్భంలో కలిశారని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుంది అని తెలిపారు .ఇప్పటికైనా దేశభక్తుల మని చెప్పుకునే బిజెపి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలని ఈ దేశ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తీసుకోవాలని అన్నారు. లేకపోతే రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి పి నాయకులు జంగం గంగాధర్ సిఐటియు నాయకులు శ్రీనివాసరాజు, నన్నే సబ్, సుకన్య, స్వప్న , ఎస్ఎఫ్ఐ నాయకులు విగ్నేష్ రాజు రైతు సంఘం నాయకులు రాజన్న,దేవేందర్ సింగ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోవర్ధన్ నాయకురాలు భాగ్యలక్ష్మి  , శంషుద్దీన్,  అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article