కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని గోదాం రోడ్డులో శ్రీ చైతన్య పాఠ్యపుస్తకాలు ఉన్న రూమ్ ను విద్యాశాఖ అధికారులు సోమవారం సీజ్ చేశారు. గోదాం రోడ్లో నివాసముంటున్న ఇంట్లో ఎవరికి తెలియకుండా శ్రీ చైతన్య పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పాఠ్యపుస్తకాలను అమ్మ వద్దని నిబంధన ఉన్నప్పటికీ ఇష్ట రాజ్యంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు శ్రీ చైతన్య పాఠశాల పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారన్న విషయం తెలుసుకొని నివాసముంటున్న ఇంట్లో పాఠ్యపుస్తకాలు స్కూల్ బెల్ట్స్ , అబాకస్ అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ , బివిఎం, బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్, బివిఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు విట్టల్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్లో గల స్పర్శ హాస్పిటల్ పక్కనగల నివాసం ఉండే ఒక ఇంట్లో దొంగ చాటున శ్రీ చైతన్య స్కూల్ కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్, బెల్స్, అబాకస్ 7 వేల నుండి నుండి 9 వేల వరకు అమ్ముతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా అమ్మొద్దని నిబంధన పెట్టినప్పటికీ ఆ నిబంధనను శ్రీ చైతన్య స్కూలు తుంగలో తొక్కుతుందన్నారు. శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ దగ్గర మామూళ్లకు అలవాటు పడి విద్యార్థి సంఘాలు సమాచారం చెప్పిన రాకపోవడం దీన్నిబట్టి చూస్తే మామూళ్లు తీసుకున్నట్టు అనిపిస్తుందని అన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేస్తామని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు పలుమార్లు ఫోన్ చేయడంతో చివరికి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది చిరంజీవి వచ్చి శ్రీ చైతన్య పాఠ్యపుస్తకాలు ఉన్న రూమును సీజ్ చేశారని తెలిపారు.

