24.2 C
Hyderabad

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నూతన కమిటీల ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ ఎంపీపీ కేతావత్ యాదగిరి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గ్రామీణ స్థాయిలో విస్తృతంగా బలోపేతం చేయడానికి జిల్లాలో ఈనెల ఆఖరి లోపు గ్రామీణ మండలా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసేందుకు  డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి, కమిటీలు నిర్మించడం జరిగిందని మాజీ ఎంపీపీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా నాయకుడు కేతావత్ యాదగిరి పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా గ్రామీణ మండల స్థాయిలో పూర్తయిన తర్వాత జిల్లా స్థాయిలో నూతన కమిటీ ఎలక్షన్లకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు బంజారా సోదరులందరూ ఏకటాటిపై ఉండి బంజారా యొక్క సత్తా ఏంటో చాటి చెప్పాలన్నారు. విలేకరుల సమావేశంలో బాబు రావు నాయక్, లక్ష్మణ్ నాయక్, వెంకట్ రామ్ నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article