ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర కీలకం

0 8,891

 

. . . బీజెపి మండల్ ప్రెసిడెంట్ అరె రవీందర్

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

ప్రజాస్వామ్య దేశంలో ఓటరు పాత్ర అత్యంత కీలకమైందని అట్టి ఓటరు జాబితాను సక్రమంగా రూపొందించడం అత్యవసరమని బీజేపీ మండల్ ప్రెసిడెంట్ అరె రవీందర్ అన్నారు. గురువారం ఆయన సతీమణి మాజీ ఎంపీటిసీ అరె లావణ్యతో కలిసి వారి ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ ఓ దీప్సన్ కు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎన్నికల సంఘం సూచించిన విధంగా గణన పత్రాలను పూర్తిగా నింపి, అవసరమైన పత్రాలను బీఎల్ ఓ లకు అందజేయాలని కోరారు. ప్రజలు ఎలాంటి అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకొని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.