29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్మూర్ మోడల్ స్కూల్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సమస్యలను తీరుస్తానని హమీ

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్‌ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి అక్కడి విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో జరుగుతున్న బోధనా విధానాన్ని తెలుసుకోవడంతో పాటు విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పాఠశాలలో ఉన్న పలు సమస్యలను, అవసరాలను ఈ సందర్భంగా వివరించారు. విద్యార్థులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

 

MLA conducts surprise inspection at Armoor Model School.

More articles

Latest article