విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

0 1,194

 తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్

 

భీంగల్, బతుకమ్మ : విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమని భీంగల్ తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్ అన్నారు.  డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) డైరీ, క్యాలెండర్ ను మంగళవారం తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్య బలోపేతం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసి వారికి ఏ రంగంలో నైపుణ్యం ఉందో కనుక్కొని ఆ రంగంలో ప్రోత్సహించి విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  జిల్లా అధ్యక్షులు ఎం.బాలయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు, ఆదర్శ పాఠశాలలు , ఆశ్రమ, గురుకుల పాఠశాలల సమస్యపరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా ఉపాధ్యక్షులు రాసరి పెంటన్నమాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డి ఏ లు, పిఆర్సి సకాలంలో అమలు చేస్తామని భరోసా ఇచ్చి సంవత్సరకాలం పూర్తికావస్తున్న పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను ముఖ్యంగా జిపిఎఫ్ పార్ట్ ఫైనల్, ఈ ఎల్ సరెండర్ తదితర బిల్లులను సకాలంలో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.  మండల అధ్యక్షులు జాన్ విల్సన్  మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. గత సంవత్సర కాలంగా  ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్ బిల్లులు, జిపిఎఫ్ లోన్స్, పెన్షనర్స్ చెల్లింపులు వంటి సప్లమెంటరీ బిల్స్  ఆర్థిక సంవత్సరం ముగింపులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో  వెంటనే చెల్లించాలని, ఇంకా జాప్యం చేయడం తగదని తెలిపారు. మండల ప్రధాన కార్యదర్శి గట్టు ఈశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం పూర్తి అయిన పి ఆర్ సి, 4 డి ఏ ల బకాయిలు పేరుకుపోవడం వంటి ఆర్థిక సమస్యలు, పలు ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు ఇంకా కూడా పరిష్కారం కాకపోవడం విచారకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో డి టిఎఫ్ మండల ఉపాధ్యక్షురాలు సంగీత, రంజిత్, శ్రీకాంత్, మధుకర్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.