బిజెపితో కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన

0 1,149
  •  నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ 

 

 నిజామాబాద్, బతుకమ్మ :  బీజేపీతో కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన చేస్తున్నాడని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నాడని అన్నారు. ఏసీబీ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ అని గాటుగా స్పందించారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. అక్రమ కేసులు పెడుతు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసే కుట్రలు తాత్కాలికమే అని అన్నారు. ఈ కార్ రేస్ వల్ల దేశానికి మంచి పేరు వచ్చిందే కానీ ,తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం నష్టం జరగలేదన్నారు. రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి అధిష్టానం బిజెపిఅని, రేవంత్ ని పక్కకు పెడితే తప్ప కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత ఆదాయం తగ్గింది అంటున్నాడు.. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మరో అధిష్టానమని ఎద్దేవా  చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు ఐధైర్యపడాల్సిన అవసరం లేదు నిలబడి కొట్లాడుతూమన్నారు.

Leave A Reply

Your email address will not be published.