నిజామాబాద్, బతుకమ్మ : ఇందల్వాయి మండలం బిసి ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను మండల విద్యాధికారి శ్రీధర్ మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాల లో మధ్యాహ్న భోజన పథకం లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని, 10 వ తరగతి పరీక్షలలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కష్టపడాలన్నారు. ఇందల్వాయి మండలం పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ మనోజ్ కుమార్ కూడా బిసిటియు నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించి ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ఉపాధ్యక్షులు జె.శ్రీనివాస్, యు.విజయ్ కుమార్, బిసిటియు ఇందల్వాయి మండల అధ్యక్షులు గంగా మోహన్ గౌడ్,ప్రధాన కార్యదర్షి ఇంద్రకరణ్, మురళి, సాగర్, స్వప్న, రజిత తదితరులు పాల్గొన్నారు.
