- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీఐపీ ల భద్రతా నేపథ్యంలో సేవలు అందించే పీఎస్ఓల పాత్ర అత్యంత ముఖ్యమైనదని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం పోలీస్ కమాండ్ కంట్రోల్ హల్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, ఇంకా అత్యవసర పరిస్థితుల్లో మీరు తీసుకోవలసిన చర్యలపై స్పష్టత ఇవ్వడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన అన్నారు. ఈ శిక్షణలో మీరు పొందే జ్ఞానం, అనుభవం మీ బాధ్యతల్ని మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి పీఎస్ఓ అధిక నైపుణ్యంతో, పట్టుదలతో, నిబద్ధతతో ముందుకు వెళ్ళడానికి ఉపయోగ పడుతుంది అన్నారు. మీ భవిష్యత్తు సేవలకు ఈ శిక్షణ మైలురాయిగా నిలవాలని అన్నారు. ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏఆర్ ఏ.రామచంద్ర రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి, సతీష్, శేఖర్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

