27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఏసీబీ ఎఫెక్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వాహనదారులు ఏజెంట్లతో సందడిగా ఉండేది. గురువారం ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి  ఆర్టీఏ ఏజెంట్ నుంచి రూ. 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.  దీంతో శుక్రవారం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సందర్శకులు, ఏజెంట్లు  లేక బోసిపోయింది. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట 50 వరకు ఏజెంట్ల కార్యాలయాలు ఉండగా అక్కడ వాహనాదరులు లేక సందడి తగ్గింది. అధికారులు సైతం ఆలస్యంగా రావడం విశేషం. రవాణా శాఖ లో ఆర్టీఏ అధికారులు అంత ఏజెంట్ల తో పనులు చక్కపెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు.  ఏజెంట్ నేరుగా ఏసీబీ కి ఎంవీఐ ని పట్టించడం అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏజెంట్లతోని పనులు చేయిస్తున్నా అధికారులు వారిని కార్యాలయంలో ప్రధాన గేటు వద్ద ఉన్న ఆపాలని సిబ్బందికి ఆదేశించినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాకు డిపార్ట్మెంట్ కు హెడ్ అయిన డీటీసీ కార్యాలయం లోకి ఏజెంట్ లకు నో ఎంట్రీ ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు ఏజెంట్లను రాజ మర్యాదలతో అనుమతించిన కానిస్టేబుల్స్, గార్డులు కేవలం వాహనదారులను మాత్రమే లోనికి అనుమతించడం గమనార్హం. జిల్లాలో చాలా రోజుల తర్వాత ఎంవీఐ ఏసీబీకి చిక్కడం అందుకు ఏజెంట్ కారకుడు కావడంతో సహాయ నిరాకరణకు అధికారులు దిగినట్లు తెలిసింది. ఈ విషయంలో ఏజెంట్ల సంఘం ప్రతినిధులఫై రవాణా శాఖ అధికారులు ఫైర్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం తో పాటు బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ కార్యాలయాలకు ఆర్టీఏ   ఏజెంట్లను అనుమతించవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గడిచిన నెలలో ఉమ్మడి జిల్లాలో మూడు చెక్ పోస్టు ల ఫై ఏసీబీ దాడి నిర్వహించగా తనిఖీలలో ఎక్కడ కూడా నేరుగా ఏసీబీ అధికారులకు రవాణాశాఖ అధికారులు చిక్కలేదు. అక్కడ ఏజెంట్లే డబ్బులు తీసుకుంటూ దొరకడంతో పార్టీ అధికారులు బతికిపోయారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులకు ఏజెంట్లతో ఉన్న సంబంధాలు బట్టబయలు అయ్యాయి. కానీ ఉమ్మడి జిల్లాలో చాలా రోజుల తర్వాత ఏసీబీకి రవాణా శాఖ అధికారులు నేరుగా దొరకడం వెనుక ఏజెంట్లు కారణం కావడంతో తాత్కాలికంగా వసూళ్ల కార్యక్రమానికి అధికారులు బ్రేక్ వేసుకున్నట్టు తెలిసింది.

ACB effect

ACB effectACB effect

 

 

More articles

Latest article