. . . వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
అనారోగ్య, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చే సహాయం అమూల్యమైన దానికి రక్తదానం సహా మానవతా సేవల్లో రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న విశేష సేవలు గొప్పవి అని రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర సమావేశానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా జిల్లా చైర్మన్లు, పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యే కు స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రెడ్ క్రాస్ సేవలు కొనియాడారు. రాష్ట్ర పాలకవర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారులు నియామకాలపై ముఖ్యమంత్రితో చర్చించి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు తక్షణం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.జిల్లా చైర్మన్, పాలకమండలి సభ్యులు త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అవసరమైన చోట్ల రెడ్ క్రాస్ సొసైటీ లకు భూ కేటాయింపు, నూతన భవనాల నిర్మాణం వంటి అంశాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి త్వరలో వివరించనున్నట్లు తెలిపారు. తలసేమియా సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నెలసరి ఆర్థిక సహాయ పథకం అమలు జరిగేందుకు ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకువస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ క్రాస్ సేవలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు .

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈ.వి. శ్రీనివాస రావు, తోట రాజశేఖర్, కె. ప్రసాద్ రావు, జనార్దన్ రావు, మహేందర్ రెడ్డి, జిల్లా చైర్మన్ లు గోలి అమరేందర్ రెడ్డి, ఎం. రాజేశ్వర్ రావు, మామిడి భీమ్ రెడ్డి, సాయి చౌదరి, భాస్కర్ రెడ్డి, వనజ రెడ్డి, వరప్రసాద్, కేశవ రెడ్డి, గంగేశ్వర్, సుదర్శన్ రెడ్డి, ఆంజనేయులు, రాజన్న, కోటేశ్వరి, రాధాకృష్ణ, విజయ్ , సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
