30.9 C
Hyderabad
Monday, August 3, 2026

యువతను సన్మార్గంలో నడిపించడమే సమ్మర్ క్యాంప్ ఉద్దేశ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

యువతను సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో యువతను ప్రోత్సహించే విధంగా ఈ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం డీఎస్ఎ గ్రౌండ్ నుండి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ని సీపీ జెండా ఊపి ప్రారంభించారు.

 

The purpose of the summer camp is to guide the youth on the right path.

 

ఈ ర్యాలీ పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి కోర్టు చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ చౌరస్తా,  పోలీస్ కార్యాలయం, విజయ్ థియేటర్,  రైల్వే కమాన్, అయ్యప్ప దేవాలయం, మీ-సేవ, పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుండడం ఎంతో గర్వకారణమని, జిల్లా నుండి ఎంతోమంది క్రీడాకారులని దేశానికి అందించినటువంటి ఘనత జిల్లాకు ఉండడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు.

 

 

ఈ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, యోగా లాంటి క్రీడలు నిర్వహిస్తున్నారని, ఇందులో అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఈ క్రీడలలో గెలుపొందే వారికి ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్, ఎన్ఎస్ సీ చైర్మన్ సాయి చైతన్య, డీసీపీ బస్వా రెడ్డి, జనరల్ సెక్రెటరీ కవిత రెడ్డి, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్,  ట్రెజరర్ సంతోష్, వివిధ విభాగాల్లో జాయింట్ సెక్రటరీలు శిరీష్, పితాని, శివప్రసాద్, గణేష్ గుప్తా, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, నిజామాబాద్ యువత, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొని దిగ్విజయం చేశారు.

 

The purpose of the summer camp is to guide the youth on the right path.

More articles

Latest article