29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఒకటవ తరగతి విద్యార్థిపై ప్రిన్సిపాల్ దాష్టికం

Must read

📰 Generate e-Paper Clip

  • వాతలు వచ్చేలా కొట్టిన వైనం
  • ఆలస్యంగా గుర్తించి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : స్కూల్ లో చెప్పకుండా ఇంటికి వెళ్లాడని ఒకటవ తరగతి విద్యార్ధిని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ చితకబాదిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగర శివారులోని సారంగపూర్ కు చెందిన ధరంసోత్ రాంసింగ్ తనయుడు ధరంసోత్ హర్షవర్ధన్ మెగా పబ్లిక్ స్కూల్ లో ఒకటవ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 26 గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం పాఠశాల నుంచి మరో విద్యార్థితో పాటు ఇంటికి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని పాఠశాలకు చెందిన యాజమాన్యం విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా హర్షవర్ధన్ ఇంటికి క్షేమంగా చేరాడని తెలిపారు. సోమవారం పాఠశాలకు వచ్చిన హర్షవర్ధన్ ను మెగా పబ్లిక్ హై స్కూల్ ప్రిన్సిపాల్  జయంతి నయానో భయనో బెదిరించాల్సింది పోయి తీవ్రంగా కొట్టింది. దీంతో అబ్బాయి ఇంటికి వచ్చి శ్రుహ తప్పి పడిపోయాడు. కాలు నొప్పిగా ఉందని తన తండ్రితో కాకుండా తల్లికి సాయంకాలం చెప్పాడు. అతని యొక్క పాయింట్ తీసేటప్పుడు ఆ గాయాలు కనబడ్డాయి.  ఒకవేళ కరస్పాండెంట్ కు చెప్తే మళ్లీ కొడతారని బాబు భయపడి ఈ స్కూల్ వెళ్లడానికి నిరాకరించాడు. గతంలో కూడా మూడుసార్లు అయినప్పటికీ కొట్టినప్పుడు ఇది నాలుగో సారి ఇంతకుముందు తమ చిన్న కూతురు స్వాతికాని కూడా ఇదే విధంగా కొట్టారు అని తల్లిదండ్రులు ఆరోపించారు. మెగా స్కూల్ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసులతో పాటు మండల విద్యాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

More articles

Latest article