27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

భవన నిర్మాణ కార్మికుల హామీలు నెరవేర్చాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా అధ్యక్షుడు బండారి (కల్లడి) గంగాధర్, పెంచ్యాలా వేణు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భవన నిర్మాణ కార్మికులకు  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కల్లడి గంగాధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెంచ్యాల వేణు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న మూడు రోజుల రిలే నిరాహార దీక్ష శిబిరంలో మంగళవారం పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు 14 రంగాలకు గుత్తేదారులు కొట్టుమిట్టాడుతూ జీవనం గడుపుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ధరలను మించి ఈ దీక్ష ద్వారా రెట్టింపు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిన వృద్ధ భవన కార్మికులకు లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, కార్మికులకు ఈ ఎస్ ఐ ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు తదితరులు పాల్గొన్నారు.

The promises of construction workers should be fulfilled

More articles

Latest article