. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సెల్ఫీ సుసైడ్ కు యత్నించిన వ్యక్తి
. టెక్నాలజీ ఆధారం లొకేషన్ ట్రేస్ చేసిన ఖాకీలు
. చాకచక్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్సై, ఐటీ కోర్ కానిస్టేబుల్
కోనసీమ, బతుకమ్మ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుని బంధువులకు పంపించాడు. పి.గన్నవరం సీఐ భీమరాజుకు సమాచారం అందడంతో ఆయన అలర్ట్ అయ్యారు. వెంటనే ఫోన్ నంబర్ ను ట్రేస్ చేయాలని ఐటీ కోర్ లో పని చేస్తున్న జాఫర్ కు పంపించాడు. అయితే ఫోన్ అప్పటికే స్విచ్ఛాఫ్ రావడంతో క్రెడెన్షియల్స్ ని ఉపయోగించి సెల్ ఐడీతో లాస్ట్ లొకేషన్ ను ట్రేస్ చేసిన కానిస్టేబుల్ జాఫర్. వెంటనే ఆ లొకేషన్ ను సీఐ భీమరాజుకు షేర్ చేశాడు. కాకినాడ జిల్లా అన్నవరంలో సదరు వ్యక్తి ఉన్నట్లు లొకేషన్ చూపడంతో సీఐ వెంటనే అన్నవరం ఎస్సై శ్రీహరిని లైన్ లోకి తీసుకున్న విషయాన్ని వివరించాడు. అన్నవరం ఎస్సై వెంటనే సిబ్బందిని ఆ లొకేషన్ కు పంపించడంతోపాటు ఆ వీడియో వెనకాల ఉన్న రూమ్ లాడ్జి రూమ్ లాగా అనిపించడంతో అన్నవరం లాడ్జి ఓనర్స్ గ్రూప్ లో దాన్ని షేర్ చేసి అలర్డ చేశాడు. వెంటనే ఓ యజమాని సదరు వ్యక్తి తమ లాడ్జీలో ఉన్నట్లు గుర్తించి ఆ గదికి చేరకుని తలుపులు బద్ధ కొట్టి వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. ఈ మొత్తం వ్యవహారం రాత్రి 11.21 నుంచి 11.27 మధ్య కేవలం ఆరు నిమిషాల్లోనే జరిగింది. పోలీసులు వేగంగా స్పందించి నిండు ప్రాణాలను కాపాడారని స్థానికులు, నెటిజిన్ లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
